బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడయ్యాడు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది’ అన్నారు. నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట.. ‘నేను మీ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను. నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు. లాస్ట్ టైమ్ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగుతాయ్. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు మీకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసిపెడుతాను’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపుడే కదా..?
74