భారత్, నేపాల్ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం.

Advertisements

<p>భారత్&comma; నేపాల్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది&period; భారత్‌తో వివాదాస్పదంగా ఉన్న లింపియాధుర&comma; లిపులేఖ్&comma; కాలాపానీ ప్రాంతాలను తమ భూభాగంలో భాగంగా చూపే మ్యాప్‌ను నూతనంగా ముద్రించే రూపాయి నాణెంపై ముద్రించేందుకు నేపాల్ దేశపు జాతీయ బ్యాంకు సిద్ధమైంది&period; చారిత్రాత్మకంగా&comma; భౌగోళికంగా ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంతర్భాగమని భారతదేశం స్పష్టం చేస్తూ వస్తోంది&period; అంతేకాకుండా&comma; ఈ సరిహద్దు వివాదాలను ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ సూచిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>వాస్తవానికి&comma; 2020 మే నెలలో కె&period;పి&period; శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుతూ నూతన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది&period; అయితే&comma; తదనంతర పరిణామాలలో ప్రస్తుత ప్రధాని బాలెన్ à°·à°¾ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వివాదాస్పద మ్యాప్‌ను నాణేలపై నుంచి తొలగించి&comma; దాని స్థానంలో ఒక ప్రముఖ మఠం చిత్రాన్ని ముద్రించాలని ఇటీవల ప్రతిపాదించింది&period; కానీ&comma; ఈ నిర్ణయాన్ని నేపాల్‌లోని విపక్షాలు&comma; జాతీయవాద వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది&period; విపక్షాల నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం&comma; పాత నిర్ణయాన్ని పునఃపరిశీలించి కొత్తగా రూపొందిస్తున్న రూపాయి నాణెంపై వివాదాస్పద మ్యాప్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.