పాక్ చర్యకు భారత్ కౌంటర్.

Advertisements

<p>భారత్–పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మరోసారి తెరపైకి వచ్చింది&period; ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌ వెలుపల పాకిస్థాన్ అధికారులు బారికేడ్లు&comma; పార్కింగ్ పోల్స్‌ను తొలగించిన మూడు రోజులకే&period;&period; న్యూఢిల్లీలో భారత్ కూడా పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చింది&period; ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన నిర్మాణాలను భారత అధికారులు తొలగించారు&period; పాక్ వీసా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ బారికేడ్లను జేసీబీలతో తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;ఇస్లామాబాద్‌లో తమ హైకమిషన్ వెలుపల పాక్ చేపట్టిన చర్యలపై భారత్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది&period; అయినప్పటికీ పాకిస్థాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు&period; దీంతో అదే తరహాలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద భారత్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది&period; ఈ పరిణామాన్ని కేవలం నిర్మాణాల తొలగింపుగా కాకుండా&period;&period; దౌత్యపరమైన పరస్పర ప్రతిచర్యగా చూడాల్సి వస్తోంది&period;ముఖ్యంగా ఇరుదేశాల దౌత్య కార్యాలయాల వద్ద భద్రత&comma; ప్రవేశ మార్గాలు&comma; అనుమతి లేని నిర్మాణాల విషయంలో తీసుకునే చర్యలు అత్యంత సున్నితమైన అంశాలు&period; ఒక దేశం తీసుకున్న చర్యకు మరో దేశం అదే స్థాయిలో స్పందించడం&period;&period; ఇప్పటికే సున్నితంగా ఉన్న భారత్–పాక్ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;అయితే భారత్ చేపట్టిన చర్యలు అనుమతి లేని నిర్మాణాల తొలగింపునకు సంబంధించినవేనని అధికారికంగా చెబుతున్నప్పటికీ&period;&period; సమయాన్ని పరిశీలిస్తే ఇస్లామాబాద్‌లో పాక్ చర్యకు ఇది ప్రతిచర్యగా కనిపిస్తోంది&period; దీంతో దౌత్యపరమైన అంశాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర చర్యలు మరింత కఠినతరం అవుతున్నాయా&quest; అన్న చర్చ మొదలైంది&period;ఒకవైపు భద్రతా అంశాలు&period;&period; మరోవైపు దౌత్య మర్యాదలు&period;&period; ఇంకోవైపు ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత&period;&period; ఈ మూడు అంశాల మధ్య తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది&period; మరి ఈ చర్యకు పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది&quest; తదుపరి దౌత్యపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి&quest; అన్నది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.