ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

Advertisements

<p>పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు&period; ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి&period; ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్‌ పర్యటన సాగుతోంది&period; రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం&comma; పశ్చిమాసియా సంక్షోభం&comma; హర్ముజ్‌ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు&comma; అమెరికా వాణిజ్య విధానాలు&comma; సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్‌ సదస్సులో కీలకంగా మారనున్నాయి&period; పుతిన్‌ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి&period; రక్షణ&comma; ఇంధనం&comma; సాంకేతికత&comma; ఔషధాలు&comma; ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు&period; రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది&period; రక్షణ రంగంలో బ్రహ్మోస్‌ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది&period; రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్‌–400 వ్యవస్థల సరఫరా&comma; సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి&period; భారత్‌లో కొత్త సివిల్‌ న్యూక్లియర్‌ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం&period; పుతిన్‌ మాత్రమే కాదు బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా హాజరుకానున్నారు&period; దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు&period; సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి&period; సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది&period; వాణిజ్యం&comma; పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది&period; సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది&period; ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్‌ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి&period; ముఖ్యంగా ఇరాన్&comma; యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది&period; హర్ముజ్‌ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది&period; ఈ నేపథ్యంలో ప్రపంచ&comma; ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్‌ నేతలు చర్చించనున్నారు&period; ఇదే సమయంలో అమెరికా వాణిజ్య&comma; సుంకాల విధానాలు కూడా బ్రిక్స్‌ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి&period; అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం&comma; ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్‌ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది&period; బ్రిక్స్‌లో తొలుత బ్రెజిల్&comma; రష్యా&comma; భారత్&comma; చైనా&comma; దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి&period; 2024లో ఈజిప్ట్&comma; ఇథియోపియా&comma; ఇరాన్&comma; యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్&comma; సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి&period; 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది&period; బెలారస్&comma; బొలీవియా&comma; కజకిస్తాన్&comma; క్యూబా&comma; మలేసియా&comma; నైజీరియా&comma; థాయ్‌లాండ్&comma; ఉగాండా&comma; ఉజ్బెకిస్తాన్&comma; వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి&period; ప్రపంచ జనాభాలో దాదాపు 49&period;5 శాతం&comma; ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం&comma; ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది&period; వాణిజ్యం&comma; పెట్టుబడులు&comma; కనెక్టివిటీ&comma; హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం&comma; వ్యవసాయం&comma; ఆహారం&comma; ఇంధనం&comma; విపత్తుల నిర్వహణ&comma; సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది&period; భారత్‌ నాలుగోసారి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది&period; శనివారం మధ్యాహ్నం 2&period;35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి&period; బ్రిక్స్‌ నేతలు రాజకీయాలు&comma; భద్రత&comma; ఆర్థిక వ్యవహారాలు&comma; ఆర్థిక సహకారం&comma; సాంస్కృతిక&comma; మానవతా సంబంధాలపై చర్చిస్తారు&period; ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం &OpenCurlyQuote;న్యూఢిల్లీ డిక్లరేషన్‌’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది బ్రిక్స్‌ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది&period; పుతిన్‌తో మోదీ భేటీ&comma; ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం&comma; ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి&period; మొత్తంగా&period;&period; ఒకవైపు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం&comma; మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం&comma; హర్ముజ్‌ పరిణామాలు&comma; వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు జరగనుంది&period; ఈ నేపథ్యంలో పుతిన్‌–మోదీ భేటీతోపాటు భారత్‌ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.