ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు.

ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు

Advertisements

<p>అమెరికా&comma; ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది&period; పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగుతున్నారు&period; తాజాగా హర్మూజ్‌ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్‌పై US ప్రతీకార దాడులు చేస్తోంది&period; ఇరానే తమ హెలికాప్టార్‌ కూల్చేసిందని ఆరోపిస్తున్న ట్రంప్‌&period;&period; ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు&period; ట్రంప్‌ ప్రకటన అనంతరం అమెరికా మిలిటరీ దాడులకు దిగింది&period; ఇరాన్‌ అనుచిత దాడి కారణంగానే తాము దాడులు చేపడుతున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది&period; హర్మూజ్‌ సమీపంలోని ఖేష్మ్‌ దీవిలో బాంబు దాడులు చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఒమన్ తీరం వెంబడి హార్ముజ్ సమీపంలో నిన్న తెల్లవారుజామున గస్తీ చేస్తుండగా&period;&period; అమెరికా మిలిటరీ హెలికాప్టర్ ఏహెచ్ 64 అపాచీ కూలిపోయింది&period; అందులో ఉన్న తమ ఇద్దరు పైలట్లను ఓ డ్రోన్ బోట్ సహాయంతో అమెరికా రక్షించింది&period; ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా హెలికాప్టర్ కూలినట్లు అమెరికా దర్యాప్తులోనూ తేలిందని చెబుతున్నారు&period; ఈ క్రమంలోనే ప్రతికార దాడులకు దిగుతోంది అమెరికా&period; అన్యాయమైన దురాక్రమణకు ప్రతిస్పందనగా ఆపరేషన్ చేపట్టినట్లు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటన చేసింది&period; ఈ మేరకు తమ సైన్యాన్ని సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది&period; ఇక అంతకుముందు దాడికి తప్పనిసరిగా సమాధానం ఇస్తామని ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ కూడా పెట్టారు&period; అనంతరం అమెరికా మిలిటరీ ఇరాన్‌పై దాడులకు దిగింది&period; దీంతో అమెరికా&comma; ఇరాన్‌ మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.