అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌

Advertisements

<p>అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు&period; అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు దక్కించుకోవడం విశేషం&period; వలసదారులపై కఠిన చర్యలు&comma; గ్రీన్‌కార్డు నిబంధనల కట్టుదిట్టం వంటి పరిణామాల మధ్య విడుదలైన ఈ జాబితా ప్రాధాన్యత సంతరించుకుంది&period; ఫోర్బ్స్‌ జాబితాలో సన్‌మైక్రోసిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకుడు&comma; బిలియనీర్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ వినోద్‌ ఖోస్లా 14à°µ స్థానంలో నిలిచారు&period; ఏంజెల్‌లిస్ట్‌ సహ వ్యవస్థాపకుడు&comma; ప్రముఖ ఇన్వెస్టర్‌ నావల్‌ రవికాంత్‌ 27à°µ స్థానాన్ని దక్కించుకున్నారు&period; జనరల్‌ క్యాటలిస్ట్‌ వ్యవస్థాపకుడు హేమంత్‌ తనేజా 31à°µ స్థానంలో&comma; మైక్రాన్‌ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా 44à°µ స్థానంలో నిలిచారు&period; అలాగే గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ 55à°µ స్థానంలో&comma; టాప్‌ చెఫ్‌ హోస్ట్‌ పద్మ లక్ష్మీ 64à°µ స్థానంలో చోటు సంపాదించారు&period; మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 89à°µ స్థానంలో&comma; ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ 219à°µ స్థానంలో&comma; అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ 221à°µ స్థానంలో నిలిచారు&period; పెప్సీకో మాజీ సీఈవో&comma; మాజీ చైర్‌పర్సన్‌ ఇంద్రా నూయి 248à°µ స్థానంలో నిలిచారు&period;మొత్తంగా 250 మంది విజయవంతమైన వలసదారుల జాబితాలో 27 మంది భారత సంతతి ప్రముఖులకు స్థానం దక్కడం భారతీయుల ప్రతిభకు మరో గుర్తింపుగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.