ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ.

ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ

Advertisements

<p>జీ 7 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో&comma; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు&period; ఇద్దరు నేతల మధ్య 16 నెలల తర్వాత జరిగిన మొదటి ఫేస్-టు-ఫేస్ భేటీ ఇది&period; రెండు దేశాల మధ్య వాణిజ్యం&comma; ఇన్వెస్ట్‌మెంట్లు&comma; శక్తి భద్రత&comma; పశ్చిమాసియా స్థిరత్వం వంటి కీలక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు&period; ఈ సమావేశం భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు&period; ఈ సందర్భంగా భారత్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు&period; మోదీ తమకు ఆప్తమిత్రుడు అని&comma; ఇరు దేశాల మధ్య త్వరలో ట్రేడ్ డీల్ జరగబోతోందని ట్రంప్ స్పష్టం చేశారు&period; భారత్ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు హర్మూజ్‌ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని&comma; అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అన్నారు ప్రధాని మోదీ&period; అక్కడ వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని&comma; వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు&period; పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్‌ కృషి చేశారని&comma; హర్మూజ్‌ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందన్నారు&period; ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని మోదీ చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..