అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం

Advertisements

<p>అమెరికా కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది&period; సముద్ర తీరంలో అలసటతో నిద్రిస్తున్న ఇద్దరు భారతీయ సంతతికి చెందిన కాలేజీ విద్యార్థినులు&period;&period; అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు&period; మృతులను కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరానికి చెందిన హర్షిత నాయర్&comma; మహియాల్ శ్రాన్‌లుగా అధికారులు గుర్తించారు&period; ఈ ఇద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఫ్రీమాంట్‌లోని వాషింగ్టన్ హైస్కూల్‌లో 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు&period;<&sol;p>&NewLine;<p>పాంథర్ బీచ్&comma; ఎల్లో బ్యాంక్ బీచ్ మధ్య ఉన్న &&num;8216&semi;కీహోల్&&num;8217&semi; అనే సహజ రాతి గుహ ద్వారం దగ్గర ఈ ప్రమాదం జరిగింది&period; ఆ సమయంలో వారు అక్కడ నిద్రిస్తుండగా&comma; వేగంగా దూసుకొచ్చిన అలలు వారిని సముద్రంలోకి లాగేశాయి&period; సమాచారం అందుకున్న వెంటనే కాల్ ఫైర్&comma; స్టేట్ పార్క్స్&comma; స్థానిక అగ్నిమాపక సిబ్బందికి చెందిన 8 మంది రెస్క్యూ స్విమ్మర్లు రంగంలోకి దిగారు&period; తీవ్రంగా శ్రమించి ఒక యువతిని హెలికాప్టర్ ద్వారా&comma; మరొకరిని స్టోక్స్ బాస్కెట్ సాయంతో తీరానికి చేర్చారు&period; ఐతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ వాతావరణ సంస్థ తీరప్రాంతమంతటా ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది&period; ప్రమాదం జరిగిన ఈ వన్-మైల్ తీరప్రాంతం అత్యంత ప్రమాదకరమైన పెద్ద అలలకు ప్రసిద్ధి చెందింది&period; ఈ ఒక్క నెలలోనే ఇక్కడ జరిగిన ఐదో సముద్ర రెస్క్యూ ఆపరేషన్ ఇది&period; &&num;8216&semi;కీహోల్&&num;8217&semi; గుహ ద్వారా అవతలి బీచ్‌కి వెళ్లే పర్యాటకులు&period;&period;పోటు వచ్చినప్పుడు నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఊహించని విధంగా చిక్కుకుపోతారని తెలిపారు స్థానిక అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..