బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

Advertisements

<p>బ్రిటన్‌లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది&period; ఆ దేశ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తన పదవికి రాజీనామా చేశారు&period; లేబర్ పార్టీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు&period; పదవిలో ఉన్నంత కాలం విలువలకు కట్టుబడి పని చేసినట్లు తెలిపారు&period; తాజా పరిణామంతో బ్రిటన్‌లో దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానుల సంఖ్య ఆరుకి చేరింది&period;<&sol;p>&NewLine;<p>కీర్‌ స్టార్మర్‌ 2024లో బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు&period; స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ పేలవమైన ప్రదర్శన మాత్రమే ఇవ్వడం&comma; మేకర్‌ఫీల్డ్‌ పార్లమెంటరీ ఉపఎన్నికలో బర్న్‌హామ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్‌ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి&period; ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో యూకే రాయబారిగా నియమించాలనే స్టార్మర్‌ నిర్ణయంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది&period; ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సహచర మంత్రులతోపాటు సొంత పార్టీ ఎంపీల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది&period; అయినప్పటికీ తాను పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని వాదిస్తూ వచ్చిన స్టార్మర్‌&period;&period; తాజాగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.