ఇరాన్ అంశంపై సెనేట్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం.

ఇరాన్ అంశంపై సెనేట్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం

Advertisements

<p>ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యల విషయంలో తన అధికారాలను పరిమితం చేస్తూ అమెరికా సెనేట్ ఆమోదించిన &OpenCurlyQuote;వార్ పవర్స్’ తీర్మానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించిన ట్రంప్&period;&period; ఈ తీర్మానాన్ని అర్థరహితమైనదిగా అభివర్ణిస్తూ&comma; దీనికి మద్దతుగా ఓటేసిన నలుగురు రిపబ్లికన్ సెనేటర్లపై విమర్శలు గుప్పించారు&period;ఇరాన్‌ను పూర్తిగా బలహీనపరిచి అమెరికా మాట వినే స్థితికి తీసుకొచ్చామని&comma; దశాబ్దాల తర్వాత మొదటిసారి ఇరాన్ అమెరికాను&comma; అమెరికా అధ్యక్షుడిని గౌరవిస్తున్న సమయంలో సెనేట్ ఈ ఓటింగ్ నిర్వహించడం సరికాదని ట్రంప్ వ్యాఖ్యానించారు&period; ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదానికి మద్దతుదారుగా తాము భావించే ఇరాన్‌కు ఈ తీర్మానం పరోక్షంగా మేలు చేసిందని ఆరోపించారు&period;<br &sol;>&NewLine;ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన నలుగురు రిపబ్లికన్ సెనేటర్లను ట్రంప్ &OpenCurlyQuote;లూజర్లు’గా అభివర్ణించారు&period; ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలపడం వల్ల అంతర్జాతీయంగా తన చర్చల సామర్థ్యాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు&period; అయినప్పటికీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు&period; స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌తో శాంతి చర్చలు ముగింపు దశకు వస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.