వెనెజులాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన జంట భూకంపాలు.

వెనెజులాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన జంట భూకంపాలు

Advertisements

<p>రెండు భారీ భూకంపాలు వెనెజులా దేశాన్ని వణికించాయి&period; కేవలం 40 సెకన్ల వ్యవధిలో సంభవించిన ప్రకృతి విపత్తులు భారీ వినాశనాన్ని సృష్టించాయి&period; ఈ జంట భూకంపాల ధాటికి 164 మంది మరణించగా&comma; 971 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది&period; వందలాది భవనాలు నేల కూలగా&period;&period; శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు&period; అన్ని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి&period; భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;<p>వెనెజులా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలిసారి భూమి కంపించింది&period; కరీబియన్‌ తీరంలోని మోరన్ ప్రాంతంలో 7&period;2 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది&period; ఆ తర్వాత కేవలం 40 సెకన్లలో 7&period;5 తీవ్రతతో మరో అతి భారీ భూకంపం సంభవించింది&period; 1900 సంవత్సరం తర్వాత వెనెజులాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే కావడం గమనార్హం&period; ఈ జంట భూకంపాల తర్వాత దాదాపు 20 కి పైగా ప్రకంపనలు వచ్చాయి&period; నిమిషం వ్యవధిలో అల్లకల్లోకం కావడంతో ప్రజలకు ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి&period; భవనాల్లో ఉన్నవారు బయటకు వచ్చే లోపే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది&period; రాజధాని కారకాస్&comma; తీరప్రాంత రాష్ట్రమైన లా గువైరాలో 100కు పైగా బహుళ అంతస్తుల భవనాలు&comma; హోటళ్లు&comma; నివాస గృహాలు కుప్పకూలిపోయాయి&period; కారకాస్‌లోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పులు కూలిపోవడంతో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు&period; మెట్రో సేవలు నిలిచిపోయాయి పలు నగరాల్లో విద్యుత్&comma; కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి&period;<&sol;p>&NewLine;<p>అయితే గూగుల్‌ సాంకేతికత చాలా వరకు వెనెజులా వాసులను కాపాడిందని చెప్పవచ్చు&period; వినాశకరమైన రెండో భూకంపం రాబోయే కొన్ని సెకన్ల ముందే ఆండ్రాయిడ్ ఫోన్లలో &&num;8216&semi;గూగుల్ ఎర్త్‌క్వేక్ అలర్ట్&&num;8217&semi; వచ్చింది&period; దీంతో అప్రమత్తమైన లక్షలాది మంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగలిగారు&period; భారీ భవనాల్లో ఉన్నవారికి మాత్రం ఆ అవకాశం లేకపోవడంతో శిథిలాల కింద చిక్కుకుపోయారు&period;<&sol;p>&NewLine;<p>ఊహకు అందని విధ్వంసం జరగడంతో&&num;8230&semi; అధికార యంత్రాంగానికి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది&period; శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్న కొద్దీ&period;&period; క్షతగాత్రులు బయటకు వస్తున్నారు&period; మృతదేహాలను వెలికితీయడం అతిపెద్ద సమస్యగా మారింది&period; దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వెనెజులా ప్రభుత్వం&period;&period; అంతర్జాతీయ సాయం కోరారు&period; ఐక్యరాజ్య సమితి సమన్వయంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు మొదలుపెట్టాయి&period; అమెరికా&comma; స్పెయిన్&comma; ఫ్రాన్స్&comma; నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రత్యేక రెస్క్యూ సిబ్బందిని&comma; వైద్య సహాయాన్ని అత్యవసరంగా తరలిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .