పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దర్యాప్తులో సంచలన విషయాలు.

పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దర్యాప్తులో సంచలన విషయాలు

Advertisements

<p>పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది&period; ఉగ్రవాదులు సాంకేతికతను వాడుకుని అత్యంత పక్కాగా ఈ దాడులకు వ్యూహం రచించినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది&period; పహల్గామ్‌లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు వారం రోజుల ముందే కుట్ర పన్నారు&period; ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బైసారన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రణాళిక రచించారు&period; లొకేషన్లను ట్రాక్ చేయడానికి&comma; సాధారణంగా పర్యాటకులు&comma; కొండలు ఎక్కే ట్రెక్కర్స్ ఉపయోగించే మొబైల్ అప్లికేషన్లు&comma; GPS టెక్నాలజీని ఉగ్రవాదులు వాడుకున్నారు&period; దాడి చేసిన తర్వాత సురక్షితంగా తప్పించుకోవడానికి కూడా ఈ జీపీఎస్ యాప్‌à°² ద్వారానే రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసుకున్నారు&period; ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఎన్‌ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు&period; ఈ ఫోన్లలో పాకిస్తాన్‌లోని తమ కమాండర్లు&comma; లీడర్లతో ఉగ్రవాదులు నిరంతరం చాటింగ్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి&period; పర్యాటకులు తమ రక్షణ&comma; సురక్షిత గమ్యస్థానాల కోసం ఉపయోగించే మొబైల్ యాప్‌లను ఉగ్రవాదులు తమ డిజిటల్ విద్రోహ చర్యలకు వాడుకోవడం జమ్ముకశ్మీర్ భద్రతా బలగాలకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది&period; ఈ సాంకేతిక ఆధారాల ద్వారా ఉగ్రవాదుల స్థానిక నెట్‌వర్క్&comma; వారికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ఎన్‌ఐఏ నిఘాను మరింత తీవ్రం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.