అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం.

అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం

Advertisements

<p>అమెరికా-ఇరాన్‌ వరుస దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి&period; ఐతే తాజాగా ఈ రెండు దేశాలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి&period; ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం దాడులు ఆపాలని నిర్ణయించాయి&period; ఖతార్‌ వేదికగా రేపు ఉన్నతస్థాయి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది&period; ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ఇరుదేశాలు చొరవ చూపినట్లు వార్తలొస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>హర్మూజ్‌ విషయంలో చర్చలు కొనసాగుతున్నంత కాలం దాడులు చేసుకోవద్దని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి&period; మిలిటరీ కార్యకలాపాలను వెంటనే ఆపేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు అమెరికా సీనియర్‌ అధికారులు&period; హర్మూజ్‌ విషయంలో సాంకేతిక చర్చలు జరుగుతున్నప్పటికీ&period;&period;ఆ జలసంధిలో నౌకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదరడంతో కీలకమైన హర్మూజ్‌లో చమురు రవాణా తిరిగి ప్రారంభమైంది&period; అయితే రెండు రోజుల క్రితం ఇరాన్‌ బలగాలు&period;&period; చమురుతో వెళుతున్న వాణిణ్య నౌకపై డ్రోన్లతో దాడికి దిగాయి&period; వాటిలో ఒక డ్రోన్‌ కార్గో షిప్‌ను ఢీకొట్టింది&period; దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధిక్కరించినందుకు అమెరికా ప్రతీకార దాడులు చేసింది&period; ఆ దేశ క్షిపణులు&comma; డ్రోన్ల నిల్వ కేంద్రాలపై యుద్ధవిమానాలతో విరుచుకుపడింది&period; ఇరాన్‌ సైతం గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది&period; రెండు రోజుల పాటు ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి&period; అయితే&comma; నష్టనివారణ చర్యలకు దిగిన అమెరికా&comma; ఇరాన్‌లు&period;&period; దాడులు మరింత పెరగకుండా&comma; ఉద్రిక్తతలు చల్లార్చేలా నిర్ణయం తీసుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.