భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి…
- సుప్రీంకు చేరిన అదానీ కేసు…అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముడుపుల వ్యవహరాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హిడెన్ బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు చేయాలని విశాల్…
- భారీగా పెరిగిన ఎలన్ మస్క్ సంపదప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం మాస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరుకుందియూఎస్ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.