భాష ప్రకృతి సంస్కృతి సంపదకు ఇచ్చిన వరం దీని వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. అంతర్జాతీయ తెలుగు మహా సభలు రెండో రోజు గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమైనాయి.దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ కంభంపాటి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఇంగ్లీషు భాషనే రాస్తుంటే తెలుగు భాష కనుమరుగు అవుతుందని భయంగా ఉందన్నారు. మిజోరాం రాష్ట్రంలో 230 గిరిజన భాషలు ఉంటే భారతదేశంలో సుమారు 14 భాషలు వాడుకలో ఉన్నాయని చెప్పారు. దీనిలో యార్లగడ్డ లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ 1998లో రాజ్యసభలో తొలిసారిగా బిల్లు పెట్టింది తాను అన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోలేదని విస్తరించిందన్నారు. తెలుగు భాషను హిందీ భాషల్లోకి అనువాదం చేస్తే తెలుగు భాష మరింత ప్రాచుర్యం పొందుతున్నారు. దీనికి ముందు గవర్నర్, యార్లగడ్డలను గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వీరితోపాటు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్ మానవేంద్రరాయ్ గుంటుపల్లి అశ్వద్ధ రామారావు, భాష్యం రామకృష్ణ, డాక్టర్ కె.ఐ.వర ప్రసాద్, కేఎల్ రాజామ్, ఎ.మోహన్ రెడ్డి, రావిపాటి మదన గోపాల్, డాక్టర్ మిధిన్ చౌదరి, బాలా త్రిపుర సుందరిలను సన్మానించారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కళాశాల ప్రాంగణంలో ఆదికవి నన్నయ్య వేదికలో కవి సమ్మేళనం నిర్వహించారు.
రెండో రోజు ఘనంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు…
71
previous post