ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి టైటిల్ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బ్యాటర్లలో మెక్ లానింగ్ 23, షెషాలీ వర్మ 44, రాధా 12, అరుంధతి రెడ్డి 10 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. ఆర్సీబీ బౌలర్లలో మోలినెక్స్ 3, శ్రేయాంక పాటిల్ 4, ఆశా శోభనా 2 వికెట్లు తీశారు. అనంతరం 114 పరుగుల మోస్తారు లక్ష్యంతో చేదనకు దిగిన ఆర్సీబీ 19. 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి డబ్ల్యూపీఎల్‌లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధన 31 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించింది. రిచా ఘోష్ 17, సోఫియా డివైన్ 32, స్టార్ ఆల్ రౌండర్ అలెస్సా పెర్రీ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ బౌలర్లలో షిఖా పాండే, మిను మనీ చెరో వికెట్ తీశారు.
ఈ సాల కప్ నందే… కప్ గెలిచాం
68
previous post