68
ఏలూరు శివారు జాతీయ రహదారిపై దారిపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర రాష్ట్ర దొంగలేనా 5 గురు యువకులు, ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు డిఎస్పి అశోక్ కుమార్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిందితులు అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 2 బైక్ లు, 2200 నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కలపర్రు టోల్ ప్లాజా వద్ద రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు..