సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌శర్మకు ఐపీఎల్‌ షాక్..

Advertisements

<p>టీమిండియా యువ ఆటగాడు&comma; సన్‌ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు IPL నుంచి షాక్ తగిలింది&period; కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు&period; అయితే&comma; ఏ సందర్భంలో అనేది ఐపీఎల్‌ కమిటీ వెల్లడించలేదు&period; కానీ&comma; తన క్యాచ్‌ విషయంలోనే అభిషేక్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది&period; నిన్నటి మ్యాచ్‌లో ముజరబాని విసిరిన స్లో బంతిని భారీ షాట్‌ కోసం యత్నించాడు అభిషేక్&period; డీప్ స్క్వేర్‌ లెగ్‌ ఫీల్డర్ వరుణ్‌ చక్రవర్తి ఆ బంతిని పట్టుకున్నాడు&period; అయితే&comma; ఆ క్యాచ్‌పై కాస్త అనుమానం ఉన్న ఫీల్డ్‌ అంపైర్లు దానిని థర్డ్‌ అంపైర్‌కు నివేదించారు&period; సమీక్షలో బంతిని వరుణ్‌ పట్టినట్లేనని భావించిన థర్డ్‌ అంపైర్ ఔట్ ఇచ్చాడు&period; దీనిపై అభిషేక్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు&period; ఏవో కామెంట్లు చేసుకుంటూ వెళ్లడంతో మ్యాచ్ రిఫరీ అతడికి జరిమానా విధించాడు&period; అభిషేక్‌ శర్మ ఆర్టికల్ 2&period;3 కిందకు వచ్చే లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడు&period; మ్యాచ్ రిఫరీ విధించిన దానిని స్వీకరించాడు&period; ఇక్కడ మ్యాచ్‌ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపీఎల్ స్పష్టం చేసింది&period; ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు&comma; 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు&period; బ్యాటింగ్‌తో అభిమానులను అలరించినప్పటికీ&comma; మైదానంలో అతని ప్రవర్తన మాత్రం వివాదానికి దారితీసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .