హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ హెచ్చరిక..

Advertisements

<p>అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ వైఖరిని కఠినతరం చేశారు&period; అమెరికా&comma; ఇజ్రాయెల్‌లతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి&period; వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను కొత్త దశకు తీసుకెళ్తామని ఖమేనీ ప్రకటించారు&period; ప్రపంచ చమురు సరఫరాలో ఈ జలసంధి అత్యంత ప్రధానమైన మార్గం కావడంతో&comma; ఇరాన్ పట్టు పెంచితే ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది&period; యుద్ధం వల్ల జరిగిన ప్రాణ&comma; ఆస్తి నష్టాలకు గానూ అమెరికా&comma; ఇజ్రాయెల్ నుంచి నష్టపరిహారాన్ని ఖచ్చితంగా వసూలు చేస్తామని ఖమేని స్పష్టం చేశారు&period; దురాక్రమణదారులను ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించారు&period; ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంలో ఇరాన్ ప్రజలే అంతిమ విజేతలుగా నిలిచారని ఆయన అభివర్ణించారు&period; శాంతిని కోరుకుంటున్నప్పటికీ&comma; తమ ప్రాథమిక హక్కులను వదులుకోబోమని తేల్చి చెప్పారు&period; చర్చల సమయంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు నిరంతరం నిరసనలు తెలుపుతూ హ్యూమన్ డిఫెన్స్ చెయిన్స్ గా ఏర్పడాలని మొజ్తబా ఖమేని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.