60
పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ బాగా తెలుసు. అంతే కాదు సిగరెట్లను తయారు చేసిన కంపనీ కూడా వాటిపై రాసి ఉంటుంది. అయినా పొగత్రాగడాన్ని మాత్రం మానలేకపోతున్నారు. దీనికి కారణం ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనే పదార్దం. ఈనికోటిన్ గుండెకు రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నికోటిన్ వలన శరీరంలో రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ నికోటిన్ ను శరీరం నుండి బయటకు పంపాలంటే పొగత్రాగడం మానడం ఖాయం.