117
గాజాలో ముమ్మర గ్రౌండ్ లెవల్ ఆపరేషన్లతో రక్తపాతం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. గాజాను రెండుగా వేరు చేసుకొని కీలకమైన దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. తమ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయని, ఉత్తర గాజా – దక్షిణ గాజాగా వేరు చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారి ఆదివారం ప్రకటించారు. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ఆదివారం మధ్యప్రాచ్య దేశాలైన వెస్ట్‌బ్యాంక్, ఇరాక్, సైప్రస్‌లలో సుడిగాలి పర్యటన చేసిన అనంతరం ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పాలస్తీనియన్లకు మానవతా సాయంపై దృష్టి సారించామని బ్లింకెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.