చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది. చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని, అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటన చేసింది. కాగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్‌పై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారాన్నిఅందించింది. 14 రోజుల తర్వాత స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు.
చంద్రయాన్-3పై ఇస్రో అరుదైన ప్రయోగం సక్సెస్
94
previous post