68
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెన్నో రోజులు లేవు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి దాడుల్లో ఫార్మా కంపెనీలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ దాడులు జరిగాయి. వారం క్రితం తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. తాజాగా సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతున్నాయి.