ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు….

choppadandi Prakash

Advertisements

&NewLine;<p>శుక్రవారం పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని&comma; పార్లమెంటు భద్రతా వైఫల్యాల చర్చకు తావివ్వకుండా సభ్యులను సస్పెన్షన్ చేసి&comma; అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు&period; పార్లమెంటులోకి చోచ్చుకొని వచ్చిన అగాంతకులు బిజెపి పార్టీకి సంబంధించిన వారేనని విమర్శించారు&period; ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడడంతోనే బిజెపి పీఠాలు కదులుతున్నాయని మండిపడ్డారు&period; సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ఎన్నికలకు వచ్చి గెలవడం బిజెపికి ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు&period; సభ్య సమాజం సిగ్గుపడేలా బిజెపి అనైతిక చర్యలకు పాల్పడుతుందని&comma; సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇండియా కూటమి ప్రజల ముందుకు వెళుతుందని&comma; విద్యార్థులు&comma; మేధావులు&comma; కార్మికులు&comma; కర్షకులు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందన్నారు&period; భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బిజెపి చేస్తున్న చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు&period; బిఆర్ఎస్&comma; బిజెపి పార్టీలు రెండు ఒకటేనని&comma; బిజెపి చేసిన చర్యను అందుకే బిఆర్ఎస్ ఖండించలేదన్నారు&period; ప్రజాస్వామ్య హక్కులను&comma; పౌర హక్కులను&comma; భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బిఆర్ఎస్&comma; బిజెపి పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు&period; ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు&comma; మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.