శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం. అయితే కర్నాటకలోని ఆ ఊరిలో మాత్రం స్వామి వారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు, భూతాలను వదిలిస్తారట. అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలా మంది స్నేహితుల దగ్గరో లేదా బంధువుల దగ్గరో దయ్యాల కథ గురించి వింటూ ఉంటారు. అయితే అవన్నీ అభూత కల్పనలనీ చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కర్నాటక రాష్ట్రంలోని కల్బూర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం, ఆత్మల్ని బంధించడం, చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గానగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలా మంది భక్తులు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు. గానుగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరం పుష్య శుద్ధ విదియ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ, అంబభవానీ. ఈ స్వామివారి పూర్వనామం నరహరి. పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం. ఈ ఆలయంలో స్వామి వారి పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం, పాదుకా దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు, వస్త్రాలను కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు.
Read Also..
Read Also..