Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home National తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ భార్య

తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ భార్య

by Satya
Rohit Sharma's wife Ritika

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా పేరును ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో చర్ఛనీయాంశమైంది. జట్టుని ఏకంగా 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా కూడా తొలిసారి రియాక్ట్ అయ్యింది. ముంబై కెప్టెన్‌ మార్పు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వకంగా స్పందించింది. ఉత్సాహభరితమైన సవాలుకు ఒక ఏడాది! చాలా గౌరవప్రదం రోహిత్!’’ అంటూ రోహిత్‌కు సానుభూతిగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై పసుపు రంగు హార్ట్ ఎమోజీతో రితికా స్పందించింది. కాగా పసుపు రంగు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంతో ప్రత్యేకమైనది. ఆ జట్టు జెర్సీ కూడా అదే రంగులో ఉంటుంది. చెన్నై సొంత మైదానం మొత్తం పసుపుమయంగా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీకి ఆదర్శప్రాయమైన సేవలు అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు అంటూ పేర్కొంది.

Advertisements

You may also like

Our Visitor

026038
Total views : 149765

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.