దొమ్మేరులో దారుణం…

It is worse in Dommeru

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి&period; బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్‌ చేశారు&period; ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు బొంతా మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించి&comma; పరిహారం ఇచ్చేందుకు వెళ్లిన హోం మంత్రిని రోడ్డుపైన నిలదీశారు&period; గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుకు కృషి చేస్తే&period;&period; మాకు చావును బహుమానంగా ఇస్తారా&quest; మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు&period;&period; ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు&quest; మేం చెప్పగానే పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా&quest; అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు&period; మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి&comma; పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున&comma; గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి హోం మంత్రి వనిత దొమ్మేరుకు వెళ్లారు&period; నాగార్జున&comma; వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత&comma; మహిళలు&period;&period; వనిత వాహనాన్ని మాత్రం అడ్డుకుని ఆమెను రోడ్డుపైనే ఆపేశారు&period; పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా&period;&period; మా గ్రామంలోకి మీరొచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు&quest; అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఈ క్రమంలో పోలీసులకు&comma; స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది&period; పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు&period; మరోవైపు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన మంత్రినాగార్జున&comma; వెంకట్రావు ప్రభుత్వం తరఫున రూ&period;10 లక్షలు&comma; వైసీపీ నాయకుడి తరఫున రూ&period;10 లక్షల చెక్కు అందించారు&period; కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…