హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ

Advertisements

<p>హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా&comma; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు&period; పాఠశాలలు&comma; కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు&period; ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి&comma; విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలకు వెళ్లేందుకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు&period; తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాల కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు&period; రాష్ట్రం&comma; దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు&period; విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని&comma; రాష్ట్ర బడ్జెట్‌లో రూ&period;26&comma;600 కోట్లు విద్యాశాఖకు కేటాయించినట్లు వెల్లడించారు&period; తెలంగాణ ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏర్పడలేదని&comma; 60 ఏళ్ల పోరాటం&comma; వందలాది మంది బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిందని అన్నారు&period;నర్సరీ నుంచి 12à°µ తరగతి వరకు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించామని&comma; తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీతో విద్యా ప్రక్షాళన ప్రారంభించామని తెలిపారు&period; తొలిసారిగా నర్సరీ నుంచి అడ్మిషన్లు కల్పించామని&comma; ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలో సీట్లు పూర్తయినా అదనంగా 1&comma;500 దరఖాస్తులు రావడం ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.