ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.

Advertisements

<p>అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి&period; ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది&period; ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా చెబుతుంటే&&num;8230&semi; మరోవైపు ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ఖండిస్తోంది&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తుండగా&&num;8230&semi; ఇరాన్ మాత్రం ఒత్తిడికి లొంగేది లేదని స్పష్టం చేస్తోంది&period; ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి&&num;8230&semi;&quest;<br &sol;>&NewLine;హార్ముజ్ జలసంధి&&num;8230&semi; ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం&period; ప్రపంచ సముద్ర మార్గంలో తరలే ముడి చమురులో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా వెళ్తుంది&period; అలాంటి వ్యూహాత్మక ప్రాంతం చుట్టూ అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి&period;<br &sol;>&NewLine;హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు&period; ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితులు స్పష్టమవుతాయని&&num;8230&semi; లేకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు&period; హార్ముజ్ అంశంపై చర్చలు చివరి దశలో ఉన్నాయని&&num;8230&semi; ఇరాన్‌కు ఇదే చివరి అవకాశమని ట్రంప్ వ్యాఖ్యానించారు&period;ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు&period; ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని&&num;8230&semi; అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు&period; ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో&&num;8230&semi; సమావేశం కావాలని కోరుతూ&&num;8230&semi; మరోవైపు చర్చలే లేవని చెప్పడం ఇరాన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది&period; ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు&period; విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మినహా చర్చల బృందంలోని సభ్యులంతా దేశంలోనే ఉన్నారని&&num;8230&semi; అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు&period;<br &sol;>&NewLine;అయితే ఒమన్‌తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది&period; హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత&&num;8230&semi; నౌకల రాకపోకలకు తాత్కాలిక ఏర్పాట్లపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయని తెలిపింది&period; ఈ చర్చల్లో అమెరికా లేదా ఇతర దేశాలు భాగస్వాములు కావని స్పష్టం చేసింది&period; ఇదిలా ఉంటే&&num;8230&semi; గల్ఫ్ ప్రాంతంలో వరుస దాడుల ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి&period; అమెరికా తన సైనిక బలగాలు&comma; నౌకాదళాన్ని అప్రమత్తం చేసినట్లు సమాచారం&period; మరోవైపు ఇరాన్ కూడా తన నౌకాదళాన్ని హై అలర్ట్‌లో ఉంచింది&period; గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే చర్యలను పలు దేశాలు ముమ్మరం చేశాయి&period;<&sol;p>&NewLine;<p>హార్ముజ్ జలసంధి మూసివేత భయం ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది&period; ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి&period; చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే&&num;8230&semi; ఆసియా&comma; యూరప్ దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<br &sol;>&NewLine;మరోవైపు మాటల యుద్ధం&&num;8230&semi; దౌత్య ప్రయత్నాలు&&num;8230&semi; సైనిక హెచ్చరికలు&&num;8230&semi; ఇవన్నీ ఒకేసారి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా–ఇరాన్ సంబంధాలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి&period; హార్ముజ్ జలసంధి వివాదం దౌత్య చర్చలతో ముగుస్తుందా&&num;8230&semi;&quest; లేక మరోసారి గల్ఫ్ ప్రాంతంలో ఘర్షణలకు దారితీస్తుందా&&num;8230&semi;&quest; అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన జుకర్బర్గ్.