నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

Advertisements

<p>నర్సీపట్నం పట్టణంలోని 28వ వార్డులోని అయ్యన్న కాలనీలో రెండు కోట్ల 28 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు&comma; కాలువల పనులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి&comma; టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ప్రారంభించారు&period; మున్సిపాలిటీ పరిధిలో గత పది రోజులుగా రోడ్లు&comma; డ్రైన్లు వంటి 189 అభివృద్ధి పనులను ప్రారంభించామని&period;&period; మరో 15 రోజుల్లో ఈ ఓపెనింగ్స్ అన్నీ పూర్తవుతాయని తెలిపారు&period; నర్సీపట్నం మున్సిపాలిటీకి 32 కోట్లు రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని&comma; మొత్తంగా 242 కోట్లరూపాయలతో పట్టణాభివృద్ధి జరుగుతోందని వివరించారు&period; రాబోయే ఏడాదిన్నరలో ఇంటింటికి కుళాయి అందించేందుకు 185 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు&period; అలాగే పట్టణంలో 1075 వీధిలైట్లు రిపేర్ చేయించి&comma; 700 కొత్త లైట్లు&comma; 140 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని&comma; అయ్యన్న కాలనీకి సైతం ఎలక్ట్రికల్ పోల్స్ అందించామని వెల్లడించారు&period; పట్టణంలోని చెత్త సమస్య పరిష్కారానికి&comma; డంపింగ్ యార్డ్ నుండి చెత్తను జిందాల్ కంపెనీకి తరలించేందుకు రూ&period; 2 కోట్లు&comma; ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ&period; 3&period;05 కోట్లు కేటాయించినట్లు ఆమె స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>గతంలో సరైన రోడ్లు లేని అయ్యన్న కాలనీలో గత రెండేళ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చామని&comma; యువతకు నాలుగు లక్షల రూపాయల నిధులు తోటి వాలీబాల్ కోర్టుతో సహా అనేక సదుపాయాలు కల్పించామని &ZeroWidthSpace; టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ అన్నారు&period; పట్టణంలోని అన్ని వార్డుల కంటే అత్యధికంగా 28వ వార్డుకే 2&period;28 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు&period; స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో పట్టణాభివృద్ధికి రూ&period; 242 కోట్లు&comma; మంచినీటి సదుపాయానికి రూ&period; 185 కోట్లు వచ్చాయని గుర్తుచేశారు&period; అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని&comma; రాబోయే మూడేళ్లలో కాలనీలో ఎలాంటి పెండింగ్ పనులు లేకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>నర్సీపట్నంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి&period; రూ&period;2&period;28 కోట్లతో సీసీ రోడ్లు&comma; డ్రైనేజీ పనులను చింతకాయల పద్మావతి&comma; చింతకాయల రాజేష్ ప్రారంభించారు&period; మున్సిపాలిటీలో ఇప్పటికే 189 అభివృద్ధి పనులు ప్రారంభించామని&comma; మొత్తం రూ&period;242 కోట్లతో పట్టణాభివృద్ధి చేపడుతున్నట్లు పద్మావతి తెలిపారు&period; తాగునీరు&comma; వీధిలైట్లు&comma; పారిశుద్ధ్యానికి కూడా భారీ నిధులు కేటాయించినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన జుకర్బర్గ్.