బొనమంద సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు. అవులపల్లి లో టిడిపి నాయకులు కబ్జా చేసుకున్న అటవీ భూములు పోతాయని అవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారు, చంద్రబాబు నాయుడు అవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో విష జ్వరాలు వస్తె తక్షణ చర్యలు తీసుకున్నాం అని, కలుషిత నీరు ఉందని తెలిసిన వెంటనే ఇక్కడ అర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశాం అన్నారు. ఎన్నికల లోపల బొనమంద, పేటూరు తదితర బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందని అన్నారు, వెయ్యి రూపాయల పైన ఎంత ఖర్చు అయినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని గుర్తుచేసారు, నాడు నేడు పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పేదల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అని కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో జన్మభూమి కమిటీ చెప్పిన వారికే పథకాలు, పెన్షన్లు ఇచ్చేవారు అని, పేదల కోసం ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాత్రమే అన్నారు. వైసిపి వచ్చాక మనకు ఎంత మేలు జరిగిందో టిడిపి కార్యకర్తలు కూడా ఆలోచించాలి అన్నారు. గతంలో 100 పేజీల మానిఫెస్టో, 600 హామీలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేసారు.
మహిళా రుణాలు మాఫీ అని చెప్పి దగ చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఆ రుణాలు విడతలవారీగా చెల్లించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దన్నారు. మనంతా కలిసికట్టుగా గా సిఎం వైఎస్ జగన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
రాష్ట్రంలో అందరికీ పధకాలు అందించిన ఘనత జగన్ దే..
73
previous post