జగనన్నా..! మా జాబ్ క్యాలెండర్‌ ఎక్కడ ?

Mitta Vamsi hunger strike

Advertisements

&NewLine;<p>జగనన్న మా జాబ్ క్యాలెండర్‌ ఎక్కడ అంటూ బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో జింఖానా గ్రౌండ్ లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు&period; ఆయన చేపట్టిన దీక్షకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంఘీభావం తెలిపారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి లో జాబ్ క్యాలెండర్‌ ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతానన్న జగన్ హామీ సిఎం అయ్యాక ఏమైందని ప్రశ్నించారు&period; ముఖ్యమంత్రి రాష్ట్ర యువతను పూర్తిగా విస్మరించారని&comma; రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఈ ప్రభుత్వం పై మండిపడ్డారు&period; యువత భవిష్యత్తు ను తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాశనం చేశారని&comma; సిఎం జగన్ నిర్వాకం వలనే ఇవాళ బిజెవైఎం నేతలు ఆమరణ నిరాహారదీక్ష కు దిగారని ఆయన అన్నారు&period; ముఖ్యమంత్రి కి రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంటే కనబడటం లేదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు&period; డిఎస్ సి లకు నోటిఫికేషన్ లు ఇవ్వలేదని&comma; చదువుకున్న యువత వయో పరిమితి దాటి నిరుద్యోగంతో మగ్గుతున్నారని ఆయన అన్నారు&period; ఉద్యోగాల కోసం 6 లక్షల మంది కి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని&comma; నాలుగున్నరేళ్లలో 1345 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు&period; యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే వాటిని డైవర్ట్ చేయడానికే‌ ఆడుదాం ఆంధ్రా అంటు ఆటలు ఆడుతున్నారు&period; కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూము లివ్వడం లేదని&comma; రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వకపోవడం వలన ఆరు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు&period; ముఖ్యమంత్రి వాళ్ల కుటుంబీకులకు&comma; సన్నిహితులకు పదవులిస్తూ యువత జీవితాలతో ఆటలాడుతున్నారని&comma; ప్రభుత్వం మెడలు వంచైనా జాబ్ క్యాలెండర్‌ సాధిస్తామని&comma; ముఖ్యమంత్రి తక్షణమే జాబ్ క్యాలెండర్‌ రిలీజ్ చేయాలని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.