335
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ పదాన్ని చెరిపేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేటీఆర్ అనడం ఆశ్చర్యకరమన్నారు. తెలంగాణ పదాన్ని చెరిపేసిందే కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించిన బీఆర్ఎస్ నేతలు ఈ మాటలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కవిత లిక్కర్ కేసును ఈడి మరుగున పర్చిందని అలాగే కేసీఆర్ అవినీతిని మరుగున పెట్టేందుకే సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. కాళేశ్వరం, యాదాద్రి, మిషన్ భగీరథలో 50 వేల కోట్లకు మించి అవినీతి జరిగిందన్నారు. న్యాయ విచారణను కాళేశ్వరానికే పరిమితం చేయొద్దన్నారు. యాదాద్రి, మిషన్ భగీరథ, భూ కేటాయింపులపై న్యాయ విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు.
Read Also..
Read Also..