రామగుండం నియోజకవర్గంలో తనను ఓడించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విజయవాడ కేంద్రంగా నాపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా లోని టీడీపీ కి చెందిన రాష్ట్ర నాయకుడు నాగ శ్రావణ్ కిలారు కొత్తగా సోషల్ మీడియా, ఫేస్ బుక్ లు ఏర్పాటు చేసి మార్ఫింగ్ లు చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నిటిని మైంటైన్ చేస్తున్న ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంశయనం పాటించాలని సూచించారు.
తనని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారన్న కోరుకంటి..
59
previous post