ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

KCR discharged

Advertisements

&NewLine;<p>తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు&period; ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు&period; ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు&period; ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది&period; దీంతో&comma; ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు&period; ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు&period; ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి&comma; చంద్రబాబు&comma; చిరంజీవి&comma; నాగార్జున తదితరులు పరామర్శించారు&period; ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి వెళ్లారు&period; పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు&period; కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.