ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రామగుండం బిజెపి అభ్యర్థి కందుల. సంధ్యారాణి గెలుస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బాలుర కాలేజీ గ్రౌండ్లో జరిగిన ప్రజాసంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. గత 20 ఏళ్ల నుంచి ప్రజల మధ్యలో ఉన్న సంధ్యారాణి ని గెలిపించి… ఇక్కడ సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు సంబంధించిన ఐటీ రద్దు చేస్తామని, అలాగే కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇప్పిస్తామన్నారు. ప్రధానంగా రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాలకు 3,100 ఇప్పిస్తామన్నారు. బీసీ బిడ్డను సీఎం చేస్తానని ప్రధాని మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలను పక్కనపెట్టి మద్యం, డబ్బులు, పోలీసులను, అధికారాన్ని నమ్ముకున్నాడని అన్నారు.
కెసిఆర్ చిల్లర రాజకీయాలు చేస్తుండు..ఈటెల ఫైర్..
64
previous post