అదానీ గ్రూప్ వ్యవహారంలో కీలక పరిణామం ..

Advertisements

<p>ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కీలక ఊరట లభించింది&period; తమపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ &lpar;ఎస్ఈసీ&rpar; నమోదు చేసిన ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు అంగీకరించింది&period; ఈ కేసు అమెరికా చట్టాల పరిధిలోకి రాదని&comma; ఇది పూర్తిగా దేశం వెలుపల జరిగిన వ్యవహారమని అదానీ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు&period; భారత్‌లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారని&comma; ఈ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టి నిధులు సేకరించారని ఆరోపిస్తూ 2024 నవంబర్‌లో ఎస్ఈసీ ఈ కేసును దాఖలు చేసింది&period; ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు ఆయన బంధువు సాగర్ అదానీని కూడా ప్రతివాదిగా చేర్చింది&period;<&sol;p>&NewLine;<p>అయితే&comma; ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకించింది&period; తమ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించింది&period; ఈ కేసు పూర్తిగా భారత్‌కు సంబంధించినదని&comma; దీనిపై విచారణ జరిపే అధికారం అమెరికా కోర్టులకు లేదని స్పష్టం చేసింది&period; అదానీ గ్రీన్ ఎనర్జీ 2021లో జారీ చేసిన బాండ్ల అమ్మకం అమెరికా వెలుపల జరిగిందని&comma; ఈ బాండ్ల కాలపరిమితి కూడా ముగిసిందని తెలిపింది&period; 2024లో అసలు&comma; వడ్డీతో సహా పెట్టుబడిదారులకు పూర్తి సొమ్మును తిరిగి చెల్లించామని&comma; కాబట్టి ఎవరికీ ఆర్థిక నష్టం జరగలేదని కోర్టుకు వివరించింది&period; ఈ నేపథ్యంలో కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని అదానీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు&period; వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు&comma; పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది&period; ఇది అదానీకి తొలి విజయం కాగా&comma; సుదీర్ఘమైన విచారణ ప్రక్రియను తప్పించుకునేందుకు ఆయనకు ఒక అవకాశం లభించినట్లయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.