పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడి నుండే పోటీ చేస్తా.. అసెంబ్లీలో అడుగుపెడతా.. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సత్తెనపల్లి గడ్డ… కోడెల అడ్డా… అనేది తద్యమని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం చేశారు. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో భాగంగా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం విస్తృతంగా పర్యటించారు. తమ అభిమాన నాయకుని కుమారుడు యువనేత డాక్టర్ కోడెల శివరాం తమ గ్రామంలోకి వస్తున్నారని తెలుసుకున్న ముస్లిం యువత అధిక సంఖ్యలో ఎదురెళ్లి మరి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరామ్ మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండడం ఖాయమని కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక ప్రజాభిమానంతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం కూడా అంతే తద్యం అన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసే నాయకుల్ల రోజుకో జెండా మోయడం కోడెల రక్తంలో లేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నానని యువ నేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుదేశం నాయకత్వాన్ని బలపరచాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, కోడెల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కన్నాపై కోడెల శివరాం హాట్ కామెంట్స్..
69
previous post