నిజామాబాద్ లో కేటీఆర్ రోడ్డు షో..!

KTR

Advertisements

&NewLine;<p>నిజామాబాద్ జిల్లా ఖిల్లా రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదని భవిష్యత్తులోనూ జత కట్టదని స్పష్టం చేశారు&period; కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని&comma; అయినా కాంగ్రెస్&comma; బీజేపీలకు భయపడేది లేదన్నారు&period; గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంద‌ని&comma; దానిని చూసి ఓటేయాలని కోరారు&period; నిజామాబాద్ నుంచి పొరపాటున షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆ తర్వాత ఆయన ఇక్కడ మళ్లీ కనిపించడని మంత్రి కేటీఆర్ అన్నారు&period; తమకు ఒక్క అవకాశమివ్వమని కాంగ్రెస్ అంటోందని&comma; కానీ 11సార్లు అవకాశమిచ్చినా చేసిందేమీ లేదన్నారు&period; పైగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ప్రయోజనమవుతుందని వ్యాఖ్యానించారు&period; అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి తానే సాక్ష్యమన్నారు&period; హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు దీటుగా నిజామాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ ఏర్పాటు చేశామని&comma; నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేశామన్నారు&period; కరోనా సమయంలో ప్రజల కష్టాలను చూసి సొంత డబ్బుతో గణేష్ గుప్తా సేవలు అందించారని గుర్తు చేశారు&period; తెలంగాణలో పదేళ్లలో ఒక్క మత ఘర్షణ లేదన్నారు&period; కాంగ్రెస్ మతపరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తోందన్నారు&period; కామారెడ్డిలో పని చేయలేని షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో ఏం పని చేస్తాడు&quest; అని ప్రశ్నించారు&period; కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా&quest; అన్నారు&period; మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..