కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశారని తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా..? ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా యువకుల జీవితాలను నాశనం చేశాడంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. తనపై జరిగిన ఐటీ రైడ్స్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏం తప్పు చేశానని ఐటీ అధికారులు సోదాలు చేశారు. పన్నులు సక్రమంగా కడుతున్నందుకా అని ప్రశ్నించారు. పోలీసులతో హౌస్ అరెస్ట్ చేసి ప్రజలకు దూరం చేయాలనే కుట్ర పన్నారంటూ కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరికీ న్యాయం, మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. యువతకు భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
కాళేశ్వరం పేరుతో లక్షకోట్లు గంగపాలు
85
previous post