సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.

సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు

Advertisements

<p>సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ&&num;8230&semi; పండించిన పంటకు సరైన à°§à°° రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో&&num;8230&semi; మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు&period; పంటను కేవలం పండించడమే కాదు&&num;8230&semi; దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు మోహన్ రెడ్డి నిరూపించారు&period; సోలార్ డ్రైయర్ యూనిట్‌ను ఏర్పాటు చేసి&comma; తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడా అన్నదాత&period;<&sol;p>&NewLine;<p>పంటలు పండించడం&comma; మార్కెట్లో దళారుల చేతిలో మోసపోవడం మోహన్ రెడ్డిని తీవ్రంగా ఆలోచింపజేసింది&period; ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా పండుతుంది&period; అయితే&comma; సీజన్ సమయంలో మార్కెట్లో మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు&period; ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలనుకున్న మోహన్ రెడ్డికి హార్టికల్చర్ శాఖ అధికారులు అండగా నిలిచారు&period; హార్టికల్చర్ అధికారులు సాగరిక&comma; కోటేశ్వరరావు సూచనలు&comma; సలహాలతో మోహన్ రెడ్డి తన పొలంలో ఒక సోలార్ డ్రైయర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు&period; ప్రభుత్వ పథకాలు&comma; అధికారుల సాంకేతిక సహాయంతో ప్రారంభమైన ఈ యూనిట్&comma; ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది&period;<&sol;p>&NewLine;<p>సాధారణంగా కూరగాయలు&comma; పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు&period; కానీ సోలార్ డ్రైయర్ ద్వారా కూరగాయలు&comma; ఆకుకూరలు&comma; పండ్లలోని తేమను పూర్తిగా తొలగించవచ్చు&period; సూర్యరశ్మిని ఉపయోగించుకుని&comma; ఎలాంటి రసాయనాలు లేకుండా&comma; సహజసిద్ధమైన రంగు&comma; రుచి&comma; పోషక విలువలు కోల్పోకుండా వీటిని డ్రై చేస్తారు&period; ఇలా ఎండబెట్టిన ఉత్పత్తులు నెలల తరబడి పాడవకుండా నిల్వ ఉంటాయి&period; మామిడి పంటకు గిట్టుబాటు à°§à°° లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో&comma; మోహన్ రెడ్డి మామిడి పండ్లను నేరుగా తక్కువ ధరకు అమ్మకుండా&&num;8230&semi; వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ప్రారంభించారు&period; సోలార్ డ్రైయర్ సహాయంతో మామిడి జామ్&comma; సాంప్రదాయ తీపి తాండ్ర&comma; సరికొత్తగా కారం తాండ్ర వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రైతు మోహన్ రెడ్డి తన ఉత్పత్తులను మార్కెట్లో కిలో 200 నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు&period; గతంలో పండ్లుగా అమ్మితే రాని లాభం&comma; ఇప్పుడు ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వస్తోందని ఆయన చెప్తున్నారు&period; కేవలం మామిడి మాత్రమే కాకుండా&comma; మార్కెట్లో కూరగాయల ధరలు పడిపోయినప్పుడు మోహన్ రెడ్డి వాటిని కొనుగోలు చేసి సోలార్ డ్రైయర్‌లో డ్రై చేస్తున్నారు&period; టమోటాలు&comma; ఉల్లిపాయలు&comma; క్యారెట్లు&comma; వివిధ రకాల ఆకుకూరలను డ్రై చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నారు&period; ఈ డ్రై చేసిన కూరగాయల ప్యాకెట్లను నాణ్యతను బట్టి 200 నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు&period; ఈ ఎండిన కూరగాయలను వంటల్లో వాడుకోవడం సులువు కావడం&&num;8230&semi; ప్రవాస భారతీయులు&comma; పట్టణ ప్రజలకు ఇవి ఎంతగానో ఉపయోగపడటంతో వీటికి మార్కెట్లో భలే డిమాండ్ ఏర్పడింది&period;<&sol;p>&NewLine;<p>మోహన్ రెడ్డి ఉత్పత్తుల నాణ్యత గురించి తెలుసి&&num;8230&semi; ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి&period; నాణ్యమైన&comma; రసాయనాలు లేని పద్ధతిలో తయారు చేయడం వల్ల ఈ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ వస్తోంది&period; పంట పండించడమే కాకుండా&comma; దానికి కాస్త సాంకేతికతను&comma; వినూత్న ఆలోచనను జోడిస్తే రైతు ఎప్పటికీ నష్టపోడని మోహన్ రెడ్డి చెబుతున్నారు&period; ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు&period; వాల్యూ ఎడిషన్ వైపు అడుగులు వేస్తే రైతులకు వ్యవసాయం ఎంతో లాభదాయకంగా మారుతుందని మోహన్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..