చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు.

చైల్డ్ సెక్స్ కంటెంటుపై మెటాకు కేంద్రం నోటీసులు

Advertisements

<p>ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం &&num;8216&semi;మెటా&&num;8217&semi; కు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇవ్వనుంది&period; ఇన్‌స్టాగ్రామ్&comma; వాట్సాప్ వేదికగా యూజర్ల భద్రతపై అసంతృప్తిగా ఉన్న కేంద్ర ఐటీ శాఖ&period;&period; మెటాకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది&period; చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయడంపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది&period; ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలను ఎలా అనుమతిస్తున్నారో వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ మెటాకు నోటీసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది&period; ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి నుండి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి&period; మరోవైపు&comma; వాట్సాప్ కొత్తగా తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కూడా కేంద్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే&period; మొబైల్ నంబర్ లేకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసుకునే ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు&comma; సైబర్ నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది&period; ఈ ఫీచర్ వల్ల యూజర్ల భద్రతకు ముప్పు లేదని సరైన వివరణ ఇచ్చేంతవరకు&period;&period; దీన్ని దేశంలో లాంచ్ చేయవద్దని మెటాను ఆదేశించింది&period; దేశంలో డిజిటల్ భద్రత&comma; ముఖ్యంగా చిన్నారుల రక్షణ&comma; యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని తాజా పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది&period; చట్ట వ్యతిరేక కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.