తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.

Advertisements

<p>తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి&period; ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి&period; భక్తి శ్రద్ధలు&comma; కోలాటాలు&comma; డప్పు చప్పుళ్లతో లంబోదరుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు&period; అయితే&period;&period; భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా&comma; సంతోషంగా సాగాల్సిన ఈ నిమజ్జన వేడుకల్లో&period;&period; ఊహించని అపశృతులు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి&period; పండగ పూట నవ్వులతో వికసించాల్సిన ఇళ్లు&period;&period; చిన్నపాటి అజాగ్రత్తల కారణంగా కన్నీటి సముద్రాలుగా మారుతున్నాయి&period; నిమజ్జన వేడుకలకు వెళ్లిన కొడుకులు శవాలై వస్తుంటే&period;&period; ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని నదులు&comma; చెరువులు&comma; కాలువలు అన్నీ కూడా గరిష్ట నీటి మట్టంతో నిండుగా ప్రవహిస్తున్నాయి&period; అత్యధిక ప్రాంతాల్లో నిమజ్జనానికి చెరువులతో పాటు&period;&period; నాగావళి&comma; వంశధార&comma; బహుదా&comma; మహేంద్రతనయ వంటి ఉధృతమైన నదులను&comma; కాలువలను భక్తులు ఎంచుకుంటున్నారు&period; కానీ&period;&period; గతంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం వల్ల ఈ చెరువులు&comma; ఘాట్‌లు చాలా చోట్ల ఊహించని విధంగా లోతుగా మారాయి&period; ఈ విషయం తెలియక&comma; లోతుపై అవగాహన లేకుండా చెరువులు&comma; నదుల గుంతల్లోకి దిగి భక్తులు జలసమాధి అవుతున్నారు&period; ఈత తెలిసిన వారు సైతం కేవలం ఒడ్డున ఉంటూనే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు మొత్తుకుంటున్నా&period;&period; అతి ఉత్సాహం ప్రాణాల మీదికి తెస్తోంది&period;<&sol;p>&NewLine;<p>పండగ సంతోషం విషాదంగా మారకుండా ఉండాలంటే ఉత్సవ కమిటీ ప్రతినిధులు&comma; యువత ఖచ్చితంగా కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు&period; ఊరేగింపుల్లోకి మద్యం సేవించి వచ్చేవారిని పూర్తిగా దూరంగా ఉంచాలని&period;&period; ప్రాణాంతకమైన&comma; మూగజీవులను సైతం హడలెత్తించే డీజే సౌండ్ బాక్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని స్పష్టం చేస్తున్నారు&period; అలాగే&comma; రహదారులపై వాహన రాకపోకలను గమనిస్తూ ముందుకు సాగాలని&comma; ఎత్తైన విగ్రహాలను తరలించే సమయంలో తలపై ఉండే విద్యుత్ తీగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period;నిమజ్జనోత్సవంలో చిన్నారులను నీటి పరిసరాలకు అస్సలు రానివ్వకూడదని&period;&period; మందుగుండు సామగ్రి పేల్చే సమయంలో ప్రధాన రహదారులపై కాకుండా సురక్షిత ప్రాంతాల్లో పేల్చాలని హెచ్చరిస్తున్నారు&period; పోలీసులు సూచించిన నిర్దేశిత మార్గాల్లోనే ఊరేగింపులు సాగాలని&comma; వేషధారణలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.