109
స్థానిక కోయంబేడు మార్కెట్లో దిగుమతులు తగ్గడంతో అల్లం ధర పెరిగింది. మార్కెట్కు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 200 టన్నుల అల్లం దిగుమతి అవుతుండేది. కానీ ఆదివారం 130 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యింది. దీంతో కొత్త అల్లం కిలో 80రూపాయల నుంచి 110 రూపాయలు, పాత అల్లం 230రూపాయలు, చిన్న ఉల్లి 80రూపాయల నుంచి 120రూపాయలు.., బళ్లారి ఉల్లి 50రూపాయల నుంచి 65రూపాయలు, టమోటా కిలో 30రూపాయలు, రెండో రకం 25రూపాయలు, మూడో రకం 15రూపాయల నుంచి 20రూపాయలకు విక్రయమయ్యాయి. దీంతో పెరిగిన రేట్లతో కొనుగోలుదారుల బెంబేలెత్తిపోతున్నారు.