మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్చార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. బిచ్చు లొంగుబాటుతో గడ్చిరౌలి జిల్లాతో పాటు మధ్య భారత్‌లోని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టయిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గిరిధర్ తుమ్రెట్టి 86 ఎన్కౌంటర్లు, 15 కాల్పుల ఘటనలో క్రియాశీలక పాత్ర పోషించాడు. బిచ్చుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనల్లో పాల్గొన్నందుకు 179 కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి