తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణ మార్పులు.. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి రెండు మూడు రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో భానుడి భగభగలు…
94