భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఎస్ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. నదీ గర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు పశ్చిమబెంగాల్ లో పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు. దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అధికారులు తెలిపారు.
భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు…
124
previous post