Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home National రాహుల్ బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త…

రాహుల్ బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త…

by Prakash
రాహుల్

బహిరంగంగా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన గతంలో పనౌతి, పిక్ పాకెట్ వంటి విమర్శలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ… రాహుల్ గాంధీకి సూచనలు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఫిర్యాదు చేసింది. గత ఏడాది నవంబర్ 24న రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది. రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఆ తర్వాత బార్మర్ ర్యాలీలో మాట్లాడుతూ… జేబుదొంగ ఒంటరిగా రాడని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. హిందు-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలను లేవనెత్తి ప్రజల దృష్టిని మోదీ మరల్చుతాడని, వెనుక నుంచి అదానీ వచ్చి డబ్బులు తీసుకుంటాడన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21న ఢిల్లీ హైకోర్టు… కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు అనుసరించాల్సిన అడ్వైజరీని చూసుకోవాలని రాహుల్ గాంధీకి ఈసీ సూచించింది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …
తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026425
Total views : 150416

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.