కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఏపీలోనూ ఎన్నికల కోడ్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనలతో కూడిన హోర్డింగులు, కటౌట్లు, పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖేశ్ కుమార్ మీనాఅదనపు సీఈవోలు, జిల్లా ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పొలిటికల్ హోర్డింగులు, కటౌట్లు తొలగించాలని ఆదేశించారు. ముఖ్యంగా, రాష్ట్ర సెక్రటేరియట్ పరిసరాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసుల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సీ విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ముఖేశ్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. కోడ్ అమలు రీత్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు.
central election commission
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..
కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్(General Election Schedule) విడుదల చేసింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్(Schedule) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections)..
ఏపీలో మే 13, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో మే 19న, ఒడిశాలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు మే 13న, రెండో దశ ఎన్నికలు మే 20న నిర్వహించనున్నారు. ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా… ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
లోక్ సభ ఎన్నికలు(Lok Sabha elections)..
ఇక లోక్ సభ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు విడతల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్ గఢ్, అసోం రాష్ట్రాల్లో మూడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరపనున్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 4 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ లో 5 విడతల్లో… ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రతి దశలోనూ కొన్ని లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్(polling) ఎప్పుడంటే…
తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశలో 89 లోక్ సభ స్థానాలకు పోలింగ్ చేపడతారు. మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. మే 7న పోలింగ్ జరుగనుంది. మూడో దశలో 94 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ విడతలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నాలుగో దశలో 96 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఐదో విడత లోక్ సభ ఎన్నికలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఐదో దశలో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 25న పోలింగ్ జరగనుంది. ఆరో విడతలో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడో విడత ఎన్నికలకు మే 7న నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. చివరిదైన ఏడో విడతలో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 17వ లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుండగా…. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనున్నాయి.
ఇది చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission):
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్(Rajeev Kumar) .. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly), లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)పై కీలక ప్రకటన చేశారు. జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లో ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరిగిందని.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, వివక్ష లేకుండా నిజాయతీగా ఎన్నికలు జరపాలని వివిధ పార్టీలు కోరాయని రాజీవ్ కుమార్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కూడా కశ్మీర్ రాజకీయ పక్షాలు కోరాయని పేర్కొన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండాలని కూడా పార్టీలు సూచించాయని చెప్పారు. వలసదారులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరాయని సీఈసీ వివరించారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనాలని జమ్ము కశ్మీర్ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఇక, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ సరైన సమయంలో విడుదల చేస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: నా వయసు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ఫాలో అవ్వండి
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే పదవి నుండి తప్పుకొవడం చర్చనీయాంశం. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తాజా రాజీనామా అనంతరం, ఇప్పటికే ఓ వెకెన్సీ ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. లోక్ సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బహిరంగంగా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన గతంలో పనౌతి, పిక్ పాకెట్ వంటి విమర్శలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ… రాహుల్ గాంధీకి సూచనలు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఫిర్యాదు చేసింది. గత ఏడాది నవంబర్ 24న రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇచ్చింది. రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆ తర్వాత బార్మర్ ర్యాలీలో మాట్లాడుతూ… జేబుదొంగ ఒంటరిగా రాడని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. హిందు-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలను లేవనెత్తి ప్రజల దృష్టిని మోదీ మరల్చుతాడని, వెనుక నుంచి అదానీ వచ్చి డబ్బులు తీసుకుంటాడన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21న ఢిల్లీ హైకోర్టు… కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు అనుసరించాల్సిన అడ్వైజరీని చూసుకోవాలని రాహుల్ గాంధీకి ఈసీ సూచించింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఏపీలో ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓటర్ల లిస్ట్ తయారీ, ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండలేమని భావిస్తే విధుల్లో తప్పుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం హెచ్చరించింది. తాము చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 దరఖాస్తులు వస్తుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడంలేదని అధికారులను గట్టిగా ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కసరత్తు, ఓటర్ లిస్ట్ తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. వివిధ పార్టీల నేతలతో సీఈసీ బృందం భేటీ అయ్యింది. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశంలో సీఈసీ బృందం పాల్గొంది.






Total views : 78647