Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home National దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ..!

దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ..!

by Satya
Modi

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule):

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ (Prime Minister Modi)దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. తమ పదేళ్ల పాలనలో బీజేపీ సర్కార్(BJP Govt) సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలను లేఖలో ప్రస్తావించారు. మరోసారి కలిసి పనిచేస్తామనే విశ్వాసం తనకుందంటూ రాబోయే ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రియమైన నా కుటుంబ సభ్యులారా.. అంటూ లేఖను ప్రారంభించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉందని… 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, ఎల్పీజీతోపాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం అందించామని మోదీ లేఖలో పేర్కొన్నారు.

ఇది చదవండి: మమతా బెనర్జీ తలకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!


భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా …
స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల …
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: